సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి, మరో మహాత్ముడు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. పాలకుర్తి మండల కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి, నాయకులకు సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు.
ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర నాయకులది ఒక వైఖరి, రాష్ట్ర నాయకులది ఓ వైఖరని బీజేపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బిజెపి రైతులను ఆగం చేస్తున్నారని.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని… రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. మూడు ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని,.. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.