సమగ్రంగా కొత్త క్రీడల విధానం.. మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో క్రీడలకు ఇతోధిక ప్రాధాన్యత లభిస్తోంది. తాజాగా కొత్త క్రీడల విధానం రాబోతందన్నారు మంత్రి కేటీఆర్. ఇది దేశంలో అత్యత్తమ విధానం అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారింది. ప్రాథమిక పాఠశాలల నుండి… ఇది ప్రతి ఒక్కరికీ ఈ విధానం అందాలి. కేవలం పని, చదువు మీదే కాదు. ఆటలు, ఫిజికల్ ఫిట్ నేస్, ఫిజికల్ విద్య తప్పనిసరి. హైదరాబాద్‌లోని దాదాపు పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేవు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారు. మంచి వాతావరణం కనిపించడంలేదు.
ఇలా చేస్తే డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు ఎలా అవుతారన్నారు మంత్రి కేటీఆర్. జాగింగ్, వాకింగ్ లేకుండా యాక్టివ్‌గా ఎలా ఉండగలం? గ్రామ, పట్టణ, నగర స్థాయిలో ఆటల మీద అవగాహన, అభినివేశం పెంచాలి. కొన్ని నిధుల ప్రోత్సాహకాలు శాఖల వారీగా ఇద్దాం. ఆటల పరికరాలు, గ్రౌండ్స్, stadiums నిర్మాణం జరగాలి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ఆటల సదుపాయాలు, ఓపెన్ జిమ్స్, ఇతర అంశాలను భాగస్వామ్యం చేయండన్నారు.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
ఒడిశా రాష్ట్రం ఆటల విషయంలో గొప్ప మౌలిక వసతులు క్రియేట్ చేశారు. దేశంలో ఎక్కడా అలా జరగలేదు. అక్కడకు వెళ్ళి పరిశీలించండి. అహ్మదాబాద్ వంటి నగరాల్లో క్రికెట్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తున్నారు. హాకీ, క్రికెట్ వంటి క్రీడల మీద దృష్టి పెట్టండి. ఒక మోడల్ తయారు చేయండి. పారా అథ్లెటిక్స్ పై కూడా ఎక్సర్ సైజ్ చేయాలన్నారు.
ప్రభుత్వం తరపున మనం సపోర్ట్ చేద్దాం. స్టేట్ ఒలింపిక్ కమిటీ, అన్ని క్రీడల కమిటీలు వున్నాయి. అవి ఏమి చేస్తున్నాయి? ఎవరికీ తెలియదు? వాటి పదవులు రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. క్రీడల్లో రాజకీయాల జోక్యం ఉండకూడదు. రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండవద్దు. నేను కూడా నా క్రీడల పదవులకు రాజీనామా చేస్తా. క్రీడా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేలా చూడాలి. అన్నిటి సమన్వయ సమావేశం పెట్టండి. జిల్లా యూనిట్ గా…కలెక్టర్లు ముఖ్య భూమిక పోషించాలి. క్రీడా మౌలిక వసతుల భవనం ఉంటుంది. వాటి నిర్వహణ సరిగా వుండడం లేదు.
ఇక్కడ సమన్వయం అవసరమన్నారు. స్పోర్ట్స్ యూనిఫాం క్యాంపెయిన్ వుండాలన్నారు మంత్రి కేటీఆర్. ప్రైవేటు రంగంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లను ప్రోత్సహిద్దాం. కొరియా దేశంలో ఇలా ఉంది. దానిని పరిశీలించాలి. పంచాయతీ రాజ్ ప్రతి శాఖ నుంచి గ్రీన్ బడ్జెట్ లా, స్పోర్ట్స్ బడ్జెట్ పెడదాం. గ్రామీణ ప్రాంతాల మంచి క్రీడాకారులు రావాలంటే అనేకం చేయాలి. మంచి కోచ్‌లు వుండాలి. అలా అయితేనే మంచి క్రీడాకారులు వస్తారు.
గ్యాంబ్లింగ్, బెట్టింగుల మీద సీఎం సీరియస్ గా ఉన్నారు. పాలసీలో దీన్ని స్పష్టంగా రాయండి. స్విమ్మింగ్ ని గ్రామాల్లో బాగా ప్రోత్సహించాలి. ఛాంపియన్స్ ఎక్కడి నుంచో రారు. మనమే తయారు చేయాలి. వ్యక్తిగత ఆటల్లో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఉన్నారు. ఎవరైనా క్రీడా సంస్థలు పెడితే, వాళ్లకు మన క్రీడా విధానం వల్ల మాత్రమే లాభం జరగాలి. ఆరోగ్య తెలంగాణ, క్రీడా తెలంగాణ కోసం పిల్లలే కాదు, అందరూ ఫిజికల్, ఫిట్ నెస్ అవగాహన పెంచి, అందరినీ భాగస్వాములను చేసే విధంగా క్రీడా విధానం ఉండాలి. సీఎం సాధ్యమైనంత త్వరగా కొత్త సమగ్రమైన క్రీడా విధానాన్ని దేశానికి ఆదర్శంగా తేవాలని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?