Errabelli Dayakar Rao: సీఎం కేసీఆర్ గిరిజనులకు 10% రిజర్వేషన్ జీవో ప్రకటిచడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలాభిషేకం చేసారు. గిజనులకి 10% రిజర్వేషన్ పెంచడానికి అసెంబ్లీ తీర్మానం చేసినక కేంద్రo సరిగా స్పందించలేదని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో గిరిజనులకు జనాభా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని గట్టి నిర్ణయం తీసుకొని చేశారని అన్నారు. గిరిజన తండాలని గ్రామపంచాయితిగా తీర్చి…
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నేటితో(ఆదివారం)ముగియనున్నాయి. వజ్రోత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలతో ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపుతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారివారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా.. అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణలో…
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు.. ఇలా రకరకాలుగా విభజనలో ఉన్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదారబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి…
Revanth Reddy: 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్‌ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు.…