ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ జరుగుతోంది.
గిరిజనులు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. గిరిజన గురుకులాల విద్యార్ధులకు అన్ని విధాల సాయం చేస్తాం. గిరిజనులకు గురుకులాలు మరిన్ని ప్రారంభం అవుతాయి. విద్యావంతులైన గిరిజన బిడ్డలు తెలంగాణలో వున్నారనే ఖ్యాతి మనకు దక్కాలి. మరో శుభవార్త చెబుతున్నాం. సంపద పెంచడం..అవసరమయినవారికి పంచుదాం. దళిత బంధులాగా గిరిజన బంధు తెస్తాం. గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ప్రారంభిస్తాం. త్వరలో దీనిని ప్రారంభిద్దాం. కులం, జాతి మతం బేధం లేకుండా కలిసి జీవించాలి. గొప్ప సమాజం రావాలి. మనం దేశానికి మనం దివిటీలుగా వుండాలి. ప్రజల పక్షాన పనిచేస్తా.
మేం విసిగి వేసారి పోయాం. సీఎస్ కి సూచిస్తున్నాం. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేస్తాం. ఈ జీవోను గౌరవిస్తావా? దాన్నే నీవు నీ ఉరితాడుగా మార్చుకుంటావా? అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎన్నో వనరులు వున్నాయి. కరెంట్ వుంది.. ఏడేళ్ళ కిందట కరెంట్ ఎలా వుంటుందో తెలుసు. కష్టపడి మనం కరెంట్ తెచ్చుకున్నాం. బోరుకి మీటరు పెట్టాలంటున్నారు. బావికాడ మీటర్ పెడదామా? పెట్టకూడదు. సులభంగా పరిష్కరించే సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రైవేటైజేషన్ ద్వారా లక్షల కోట్లు భూస్వాములకు పంచేస్తున్నారు. నదుల్లో ప్రవహించే నీరు సముద్రంలో కలవ కూడదు. భారత రాజకీయాలను ప్రభావితం చేయగలిగే శక్తి మనకు వుంది. తెలంగాణ కోసం చేసిన ఉద్యమం మళ్లీ రావాలి. విద్వేష రాజకీయాలను బద్ధలు కొట్టాలి.
గిరిజనులు ఎక్కువగా వుండే చోటు గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించాం. ఎంతోమంది గిరిజనులకు న్యాయం చేస్తున్నాం. అడవుల్లో వుండేవాళ్ళకు భగీరథ నీరు అందిస్తున్నాం. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లోని సంపన్నులు తాగే నీటిని గిరిజన తండాలకు నీరు అందిస్తున్నాం. త్రి ఫేజ్ కరెంట్ అందిస్తున్నాం. వంద యూనిట్ల వరకూ గిరిజనుల ఇళ్ళకు రాయితీ ఇస్తున్నాం. గిరిజనులకు విష జ్వరాలు లేవు.. అన్ని సంక్షేమ కార్యక్రమాలు గిరిజనులకు అందిస్తున్నాం. ప్రత్యేక భాష, సంస్కృతిని గౌరవిస్తున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చింది.. అందుకే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం చేసుకున్నాం.
రాష్ట్రంలో పోడు రైతులకు న్యాయం చేస్తాం.. ఆ రైతులకు కూడా రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఏ వర్గం ప్రజలకైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసిందా? దుర్మార్గ పాలన సాగుతోంది. లక్షల కోట్ల ప్రజల ఆస్తులు పెట్టుబడిదారులకు ఇచ్చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఐకమత్యంగా వుండాలి. తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మహారాష్ట్ర వాళ్ళు జాతీయ పార్టీకి స్వాగతం చెబుతామన్నారు. వాళ్లుఈ సభకు వచ్చారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్ వచ్చి విభజన రాజకీయం నడిపిస్తున్నారు. గిరిజన రిజర్వేషన్ ఎందుకు అమలు కావడం లేదు. గిరిజన బిడ్డలకు న్యాయం చేయండి. ప్రధాని మోడీ పుట్టినరోజు.. ఆయనకు చేతులు జోడించి అడుగుతున్నా. మా బిల్లుకు రాష్ట్రపతి స్టాంప్ వేయించి పంపండి. రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ వున్నారు. ఆమె ఆపరు. ద్రౌపది ముర్ము వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చేయండి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతం రిజర్వేషన్ వుండకూడదని ఎక్కడా లేదు. పక్కన తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ వుంది. ఈ సభ తీర్మానం చేస్తోంది. గిరిజనులకు రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం ఇవ్వాలి. వినపడుతోందా అమిత్ షా గారూ.. ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీకు వినిపిస్తోందా? మీకున్న ప్రతిబంధకం ఏంటి?
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేదిక అధ్యక్షురాలిగా మంత్రి సత్యవతి రాథోడ్ వ్యవహరించారు. ఈ సభకు భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, గిరిజనులు, బంజారాలు హాజరయ్యారు. గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రణామాలు చేశారు. రూ.60 కోట్లతో ఆదివాసీ బంజారా భవన్, సంత్ సేవాలాల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా వుంది. చాలా సమస్యలు వున్నాయి. శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళతాం. మేథోమథనం చేయాలి. మీరందించే సూచనలు, సలహాలు ఇవ్వాలి. అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపడుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కొంతమంది గిరిజనులను మోసం చేస్తున్నారు. దేశంలో ఎక్కువకాలం పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది. గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు రావడం లేదు. మేం వస్తే ఇస్తామని అబద్ధం చెబుతున్నారు. గిరిజన రిజర్వేషన్ ఎందుకు ఆపారు. యూనివర్శిటీ ఎందుకివ్వలేదు. గిరిజనులు ఆరాధించే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ చేయమంటే ఎందుకు చేయలేదు. గిరిజనులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు.