ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమక్షంలో ఒడిశా మాజీ సీఎం, ఆరాష్ట్ర సీనియర్ నేత, గిరిధర్ గమాంగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు కవిత ట్వీటర్ వేదికగా స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు.
గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం విషయంలో గొడవ సరికాదని.. ప్రభుత్వం వెంటనే గవర్నర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ఈ జాతి గొప్పదనం స్మరించుకోవాల్సిన సమయం ఇది అన్నారు రేవంత్ రెడ్డి.
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి సీఎం పుష్పాంజలి ఘటించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. జాతీయ జెండాను ఎగుర వేసిన రాష్ట్ర అధ్యక్షుండు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ కి ఈ దేశంలో ఉండే అర్హత లేదన్నారు.