గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ అని ప్రపంచం మొత్తం దేశాన్ని కొనియాడుతుందని, రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు, దేశ ప్రజానికానికి స్పూర్తి నింపే రోజు జనవరి 26 అని, తెలంగాణ ప్రభుత్వం జనవరి 26ను జరపకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ కేసీఆర్ గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరు జుగుప్సాకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పట్ల చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా సమాజం తలదించుకుంది. గవర్నర్ ను అవమాన పరచడం …రాజ్యాంగాన్ని, తెలంగాణ మహిళలను అవమనపరచడమే. కేసీఆర్ కి మొదటి నుంచి గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు.
Also Read : Suriya: ఆత్మను పోగొట్టుకున్న సూర్య.. ఎమోషనల్ ట్వీట్
గవర్నర్ లను అనేక సార్లు కలిశారు… మొకరిల్లి వందనం చేసిన రోజులు కూడా వున్నాయి. కానీ తమిళిసై వచ్చాక గవర్నర్ ను అవమానిస్తున్నారు. ఫ్యూడల్ కుటుంబంలో పుట్టిన వ్యక్తిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్ల పాటు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు. ఒక ఎస్సి,ఒక బీసీ మహిళ లేకుండా అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి కేసీఆర్. సరూర్ నగర్ ఆర్ఫాన్ పాఠశాల లో 400 బాలికలకు ఒక్క టాయిలెట్ ఉంది. ఢిల్లీ వచ్చి హాస్పిటల్స్,స్కూల్స్ తిరిగి చూసి అవన్నీ తెలంగాణ లో అమలు చేస్తామని చెప్పిన కేసీఆర్ కి సిగ్గుండాలి. మహిళల పట్ల కేసీఆర్ చులకన భావంతో ఉన్నారు.’ అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
Also Read : Today (27-01-23) Stock Market Roundup: ‘అదానీ’ ఎఫెక్ట్.. 3 నెలల కనిష్టానికి మార్కెట్..