సొంత నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాలేదని ఆత్మహత్య కోసం ప్రయత్నించారు ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్ల కలెక్టర్ ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పల్లెల్లో కరెంట్ ఉండటం లేదని, గిరిజన,హరిజన కాలనీలల్లో మీటర్లు లేవని కరెంట్ కట్ చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనపడటం లేదని ఈటల రాజేందర్ అన్నారు. ట్రేడ్ ఫేర్ లో కూడా తెలంగాణ భాగం కావడం లేదని, తెలంగాణ ప్రత్యేక దేశం ..భారత్ లో భాగం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు ఈటల రాజేందర్. గవర్నర్ ను అవమానించడం మానుకోవాలని ఆయన సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు ఈటల రాజేందర్. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోడీదని, కానీ తెలంగాణా ముఖ్యమంత్రికి గవర్నర్ ను గౌరవించే సంస్కారం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు.
Also Read : Vijayashanti : సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను
ప్రతిపక్ష పార్టీలను మింగేశారని, నేను గెలిచి 13 నెలలు అయినా అసెంబ్లీలో మాట్లాడకుండా నా గొంతు నొక్కుతున్నారన్నారు. మమ్మల్ని విమర్శించినంత మాత్రాన మేము వెనక్కి తగ్గమన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. 2023 వరకే కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని, తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయమన్నారు ఈటల రాజేందర్. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదని, కేసీఆర్ వెల్లగొడితే అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు. సీపీఐ, టీడీపీ,కాంగ్రెస్ పార్టీలను ఎందుకు మింగుతున్నడో సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నాకు ఎవరి సానుభూతి అక్కరలేదు.. నాకు ప్రజల సానుభూతి ఉందని, నాపై పోటీ కోసం ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో అందరూ చూశారని, తెలంగాణ ప్రజల అండ నాకుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Also Read : CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు