మహారాష్ట్రలోని నాందేడ్ సభ సన్నాహాల్లో భాగంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటన కొనసాగుతుంది. సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను ఇవాల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు.