తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.