CM KCR: మొన్న బీహార్ వెళ్లొచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారని సమాచారం. అనంతరం.. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను సందర్శిస్తారని వార్తలొస్తున్నాయి. 'బీజేపీ ముక్త్ భారత్' నినాదంతో విపక్షాలను ఏకం చేసేందుకు, 2024 జనరల్ ఎలక్షన్‌లో అధికార పార్టీ కమలానికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన కామెంట్లు చేశారు. కేటీఆర్ ఇప్పటికే పలు దేశాలు పర్యటించారు. భారీగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చైనా వెళ్లారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆ సంగతి ఏమైంది? వీళ్ళు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్లడం లేదు. వేరే దేశలో…