‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను శాసనసభ, శాసనమండలి ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు.