విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) విజయవంతం కావటం పై ముఖ్యమంత్రి జగన్ కు మంత్రులు అభినందించారు సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. అభినందనల తీర్మానాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రవేశ పెట్టారు.పెన్షన్లను ఏప్రియల్ 3వ తేదీన పంపిణీ చేయనున్నాం. ఏప్రియల్ ఒకటిన ఆర్బీఐ శెలవు, రెండో తేదీన ఆదివారం కావటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో అభినందనలు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కమిషన్ కాల పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్ళకు తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
అవసరమైతే రెండో టర్మ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ సదుపాయం కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచారు. ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం. హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తారు. టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసింది కేబినెట్.
Read Also: Fire At Simhachalam: సింహాద్రి అప్పన్నకొండల్లో కార్చిచ్చు
అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు -1987 ప్రకారం అన్ని దేవ స్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడ్ని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. దేవాలయాల్లో క్షుర కర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు రూ.20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షరకులు ఇది వర్తింపు. పట్టాదార్ పాస్ బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం తెలియచేసిందని తెలిపారు మంత్రి వేణుగోపాల కృష్ణ.
Read Also: Chada Venkat Reddy : కేంద్రంలో, రాష్టంలో పార్టీ జెండాలు మారిన పేదల బతుకులు మాత్రం మారలేదు