ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 7.30 నిమిషాలకు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రేపు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ఇవాళ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తున్నారు. రేపు ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు.