నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ సమీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్ చర్చించనున్నారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయంపై సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే, మేం అణ్వాయుధం వినియోగిస్తాం.. దిమిత్రి హెచ్చరిక
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన కొత్తలో రష్యా దాడులకు ఉక్రెయిన్ వణికిపోయింది. కొంత భూభాగాన్ని సైతం రష్యా స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ పరిస్థితి అప్పట్లో దయనీయంగా తయారైంది. అయితే.. ఉక్రెయిన్ కుంగిపోలేదు. ఎదురుదాడులకు దిగి, ధీటుగానే రష్యాకి బదులిస్తూ వస్తోంది. ఇక ఈమధ్య నాటో మద్దతుతో ఉక్రెయిన్ వరుస దాడులతో తెగబడుతోంది. రష్యా కంటి మీద కినుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మిద్వెదేవ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ తమపై కొనసాగుతున్న ఎదురుదాడుల్లో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తే.. తాము కీవ్‌పై అణ్వాయుధ ప్రయోగం చేయక తప్పదంటూ కుండబద్దలు కొట్టారు.
ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 8 మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 30 పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు. పలుచోట్ల పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల ఏపీలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే.. లోతట్టు ప్రాంతాల ప్రజలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయితే.. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలువురు వరదల్లో చిక్కుకున్నారు. వారిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాకపోకలు పడవలపై చేయాల్సిన పరిస్థితి కూడా కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో దాపురించింది.
నికోలస్ పూరన్ విధ్వసం.. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్!
మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్‌ఎల్‌సీ) 2023 టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ నిలిచింది. సోమవారం డల్లాస్‌లో జరిగిన ఎమ్‌ఎల్‌సీ 2023 ఫైనల్‌లో సీటెల్ ఓర్కాస్‌పై ముంబై న్యూయార్క్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీటెల్ నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై 16 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ముంబై కెప్టెన్, విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పూరన్ విధ్వసంతో ముంబై జట్టు మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్ ఛాంపియన్స్‌గా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 రన్స్ చేశాడు. శుబమ్ రాజనే (29), డ్వైన్ ప్రిటోరియస్ (21) పరుగుతో రాణించారు. సీటెల్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. స్టీవెన్ టేలర్, డేవిడ్ వీసీ చెరో వికెట్ పడగొట్టారు.
దేశంలో పెరుగుతున్న కండ్లకలక కేసులు.. లక్షణాలు ఏంటంటే?
వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.. కేవలం బాడీకి మాత్రమే కాదు కళ్ళకు కూడా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి.. ఇటీవల కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు..’ఐ ఫ్లూ’ అని పిలవబడే కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 39,000 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇటీవల కురిసిన వర్షాల ఫలితంగా నీరు నిలిచిపోవడం మరియు నీటి నిల్వలు పెరగడం వల్ల కంటి ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే నీటిలో బ్యాక్టీరియా మరియు వైరస్‌లు పుట్టుకొస్తాయి. కండ్లకలక యొక్క కొన్ని సాధారణ లక్షణాలు ఒకటి లేదా రెండు కళ్ళలో ఎరుపు లేదా దురద మరియు అధిక కన్నీటి ఉత్సర్గ ఉన్నాయి.. ఈ వ్యాధి గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్
మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. ఈ రైలు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి కర్ణాటకలోని యశ్వంతపుర వరకు నడుస్తుంది. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఆగస్టు 6న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుందని గంటకల్లు డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ వెల్లడించారు. గంటకల్లు డివిజన్‌లో డోన్ రైల్వేస్టేషన్ మొదటిది కావడంతో ఇక్కడ నుంచే ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు డోన్ నుంచి కాచిగూడ వరకు వందేభారత్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డోన్ లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్ డీఆర్ ఎంతో పాటు వివిధ శాఖల అధికారులంతా పాల్గొంటారని వెల్లడించారు. డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రెండు కిలోల టమాటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన నీచుడు..
ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు పిల్లలను టమాటాల కోసం తాకట్టు పెట్టిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వినియోగదారుడు ఇద్దరు పిల్లలను దుకాణంలో కూర్చోబెట్టి టమాటాలతో పరారయ్యాడు. ఈ ఘటన కటక్‌లోని చత్రాబజార్ ప్రాంతంలో జరిగింది. సమాచారం ప్రకారం.. నందు కటక్‌లోని చత్రబజార్ కూరగాయల మార్కెట్‌లో కూర్చుని, తన కూరగాయల దుకాణాన్ని ప్రతిరోజూ లాగానే అలంకరిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ పిల్లలతో కస్టమర్‌గా నటిస్తూ తన దుకాణానికి చేరుకున్నాడు. దుకాణదారుడు నందుతో టమోటాల కోసం బేరం కుదుర్చుకున్నాడు.
టమాటా టోకు ధర కిలో రూ.130గా నిర్ణయించారు. రెండు కిలోల టమాటాలు తీసుకున్న తర్వాత తాను ఇంకా 10 కిలోలు కొనాలని దుకాణదారునితో చెప్పాడు. కారులో పర్సు మర్చిపోయాను. తీసుకుని వస్తా.. అప్పటివరకు మా పిల్లలను చూసుకోమని.. ఈ లోగా కారునుంచి పర్సు తీసుకు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అక్కడే పిల్లలు, దుకాణదారు ఇద్దరూ అతని కోసం వేచి ఉన్నారు.
ఇండ్లు కట్టరు.. కట్టిన వాటిని అర్హులకు పంచరు..
మహబూబ్ నగర్ లో జరిగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారు. పేదల కల.. డబుల్ బెడ్రూం ఇండ్లని, పేదలకు అందించే వరకు మా పోరాటం సాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని తెలిపారు. కేంద్రం ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కట్టిన ఇండ్లు పాడవుతున్నా పేదలకు ఇవ్వకపోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని తెలిపారు. పేదలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రం నిధులు రూ. 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర బీజేపీ నేతలు పర్యటిస్తున్నారని తెలిపారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు కూడా వచ్చాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకే ముక్కలని విమర్శించారు. గతంలో మూడు పార్టీలు పొత్తులు పెట్టుకుని కలిసి పనిచేశాయన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసానికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కుటుంబ, అవినీతి, నియంతృత్వ పార్టీలని విమర్శించారు.
సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అసైన్డ్ భూములు పేదలకే దక్కేలా చర్యలు చేపట్టండని ఆయన లేఖలో పేర్కొన్నారు. 20 ఏళ్లు పైబడిన అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్లు తెలుస్తోందని, ఈ అసైన్ చట్ట సవరణ ద్వారా వైసీపీ నేతలు, రియల్టర్లు, భూస్వాములు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నారు రామకృష్ణ. ఇప్పటికే పరాధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలను గుర్తించి, నిజమైన పేద లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు చేపట్టండని ఆయన కోరారు. ఈ అసైన్ చట్ట సవరణ ద్వారా పలువురు నేతలు, రియల్టర్లు, భూస్వాములు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పరాధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలను గుర్తించి, నిజమైన పేద లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన
రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రేపు సీఎం జగన్ వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టనున్న 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్, బయో మోనిటరింగ్ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. 12.50 గంటలకు ఏయూ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు.