యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి 650 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కేసీరెడ్డి తెలిపారు. మొత్తం ఖాళీల్లో 400 అసిస్టెంట్ ప్రొఫెసర్, 250 లెక్చరర్ పోస్టులను నవంబరులోగా పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు.
Also Read : Tesla: టెస్లా మొదటి కార్యాలయం.. ఇండియాలో ఎక్కడో.. దాని అద్దెంతో తెలుసా?
అయితే.. నిన్న మహిళా, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ – టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఫౌండేషన్ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా గర్భిణీలు, బాలింతలు రేషన్ అందుకున్నారు. పౌష్టికాహారం కోసం ప్రతిఏటా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారుగా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్ తెలిపారు.
Also Read : Health Tips : ఈ ఆహారాలను ఎప్పుడూ ప్రెజర్ కుక్కర్ లో వండకూడదు తెలుసా?