మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాజమండ్రిలోని వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు.
సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
వర్షాభావంతో రాష్ట్రంలో పంటలు అగమౌతున్నాయని జాతీయ కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి అన్నారు. ప్రధానంగా వర్షాధార పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు.
వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
AP Minister RK Roja Slams Chandrababu Naidu and Pawan Kalyan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌ను ఓడించాలంటే.. అవతలి వైపు కూడా జగనే ఉండాలన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు.. జగన్‌ను ఎలా ఓడిస్తాడు అని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రజలందరూ 2024 జగనన్న వన్స్‌మోర్ అంటున్నారని, ఆంధ్ర రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ మేరకు నగరి…