వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. రాజేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ప్రీతికరమైన ‘కోడె మొక్కు’ నైవేద్యాలు సమర్పించారు. అంచనాలకు విరుద్ధంగా, శ్రావణ మాసం మొదటి రోజున యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది. జులై 29 నుంచి ఆగస్టు 28 వరకు జరిగే ఈ నెల రోజుల ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
ట్రంప్ తో అట్లుంటది మరి..కాసులు వర్షం కురిపిస్తున్న మగ్ షాట్
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ గత వారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత గురువారం ట్రంప్ జార్జియా జైలులో లొంగిపోయారు. అయితే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అరెస్ట్ చేసినప్పుడు అందరి నిందుతులు లాగానే ట్రంప్ మగ్ షాట్ ( నిందుతులకు జైలులో తీసే ఫోటో) తీశారు. అయితే జైలు నుంచి విడుదల కాగానే ఈ ఫోటోను ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో పంచుకున్నారు. 2020 జనవరిలో ట్రంప్ ఖాతాను ట్విటర్ నిషేధించిన తరువాత తొలిసారి గత గురవారం అరెస్ట్ అయి విడుదలైన వెంటనే ఎక్స్ లో తన మగ్ షాట్ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. ఇక ఇప్పుడు ఆ మగ్ షాట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రంప్ మగ్ షాట్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో టీషర్టులు, బీర్ కూజాలు, కాఫీ మగ్‌లు, బంపర్ స్టిక్కర్లు, పోస్టర్లు తయారు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో విక్రయిస్తున్నారు. ఇవి క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. అంతేకాకుండా ఆ మగ్ షాట్ ఫోటో కింద ‘నెవర్ సరెండర్’(ఎప్పుడూ లొంగిపోవద్దు) అని కూడా ప్రింట్ చేశారు.
ఆపరేషన్ ‘చిరుత’ సక్సెస్.. ఇక కాలినడక భక్తులు ప్రశాతంగా వెళ్లొచ్చు!
తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
గత కొన్నిరోజులుగా అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. చిన్నారి కౌశిక్‌పై దాడి, లక్షిత మృతితో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు చేపట్టింది. టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూడింటిని పట్టుకోగా.. నాలుగో చిరుత బోను దాకా వచ్చి తప్పించుకుపోతోంది. వారం రోజుల అనంతరం ఆదివారం రాత్రి 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది.
టీచర్ దెబ్బకి మూతబడిన స్కూల్.. దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఉత్తరప్రదేశ్ లో రెండో తరగతి చదువున్న ముస్లిం విద్యార్థిని ఓ టీచర్ ఇతర పిల్లలతో కొట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎక్కాలు సరిగా చెప్పలేదని తోటి విద్యార్థులతో కొట్టించినట్లు టీచర్ తెలిపింది. అయితే ఆమె అసభ్యంగా మాట్లాడిన మాటలు, మతం గురించి ప్రస్తావించడం వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఈ వీడియో వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యాశాఖ స్పందించి దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు సందర్భంగా కూడా ఆ టీచర్ తాను చేసిన పని పట్ల సిగ్గుగా ఫీల్ అవడం లేదంటూ పేర్కొనడం గమనార్హం. ఇక ఇలా చిన్న చిన్న విషయాలను కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తాము పని చేయడం కష్టమని, చిన్నప్పటి నుంచే పిల్లలకు భయం పెట్టాలని కూడా ఆ టీచర్ పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను కొడితేనే వారికి భయం ఉంటుందని ఆమె మాట్లాడారు.
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీ వెళ్లలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్!
టీడీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు నందమూరి కుటుంబసభ్యులు నాణెం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 200 మంది అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందినా.. ‘దేవర’ సినిమా షూటింగ్ కారణంగా ఆయన ఢిల్లీ వెళ్లలేకపోయారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా 51,000 అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ
ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజ్‌గార్ మేళాలో భాగంగా 51,000 మందికి అపాయింట్మెంట్లు లెటర్లు పంపిణీ చేశారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిని ప్రధాని మోడీ కొత్తగా ఉద్యోగాల్లో చేరబోతున్న వారిని ‘ అమృత రక్షకులు’గా పేర్కొన్నారు. ఉద్యోగాల్లో చేరుతున్న వారికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగాలు ఎక్కువగా పారా మిలిటరీ దళాల్లో ఉండనున్నాయి.
గతేడాది కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ సారి దేశం గర్వంగా, ఆత్మవిశ్వాసంగా రోజ్‌గార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందని అన్నారు. మన చంద్రయాన్, రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుని నుండి చారిత్రాత్మక ఫోటోలను నిరంతరం పంపుతున్నాయని ఆయన అన్నారు. ఈ దశాబ్ధంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవప్థలో భారత్ మూడో స్థానంలోకి చేరుతుందని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి
క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి.. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి అని 8వ జాతీయ రోజ్ గార్ మేళా లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హాకీంపేట్ CISF, NISA, అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. CISF, CRPF, ITBP, SSB రంగాల్లో మొత్తం 4శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 8వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు 5లక్షల 50వేలకు పైగా మంది యువతకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ.. వెయ్యి-1200 ఏండ్ల క్రితం నుంచే మన దేశంపై దాడులు జరిగాయి. ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారన్నారు.
చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
ఇటీవల భారత జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా జనాలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదరితే అక్కడ సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇప్పటికే రాహుల్ సామాన్యలతో కలిసి లారీ నడిపారు, బైక్ మెకానిక్ గా మారారు, అంతేకాదు పొలం పనులు కూడా చేశారు. ఇక తాజాగా రాహుల్ చాక్లెట్లు కూడా తయారుచేశారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. రాహుల్ ఓ చిన్నారిని తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ మార్గమధ్యంలో ఊటీలో ఆగారు. అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు రాహుల్. దాని గురించి చెబుతూ ఆశ్చర్యానికి గురయ్యారు రాహుల్. ఎందుకుంటే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో అందరూ మహిళలే ఉద్యోగం చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు వారే చూసుకుంటారు. ఇక చాక్లెట్ ఎలా తయారు చేయాలో వారిని అడిగి తెలుసుకున్న రాహుల్ ఆయన కూడా తయారు చేశారు.
మరో శ్రద్ధావాకర్ తరహా ఘటన.. ప్రెషర్ కుక్కర్‌తో హత్య..
ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ ఉదంతం దేశాన్ని కలవరానికి గురి చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాని, అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా చంపాడు. ఈ ఘటన తరువాత ఇలాగే పలు ప్రాంతాల్లో సహజీవనంలో ఉన్న మహిళల్ని వారి ప్రియులు చంపేశారు.
ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాగే లివ్ రిలేషన్ లో ఉన్న ఒక మహిళను చంపేశాడు. అనుమానంతో ప్రెషర్ కుక్కర్ తో కొట్టి చంపేసిన ఘటన నగరంలోని బేగూర్ లోని మైకో లేఅవుట్ లో శనివారం సాయంత్రం 5 గంటలకు చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపించిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్!
గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఈసారి స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.17 మీటర్లు విసిరిన నీరజ్.. పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 88.17 మీటర్లు విసిరగా.. మొత్తం ఆరు ప్రయత్నాల్లో ఈ దూరాన్ని మరో అథ్లెట్ అధిగమించలేకపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజత పతకం దక్కించుకోగా.. చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వాద్లెచ్ 86.67 మీటర్లతో కాంస్య పతకం సాధించాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023లో పాకిస్థాన్ అథ్లెట్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతో.. భారత దేశంలో ఈ పోరును ఇండో-పాక్ మధ్య యుద్ధంగా భావిస్తారని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నీరజ్ మాట్లాడుతూ… ‘నేను ఏ పోటీకి ముందు అయినా ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడను. కానీ ఈ రోజు ఫోన్ చూడగా.. అందులో మొదటగా భారత్ vs పాకిస్థాన్ అని కనబడింది. అయితే యూరోపియన్ అథ్లెట్లు చాలా ప్రమాదకరం. వారు పెద్ద త్రోను చేయగలరు. అర్షద్ నదీమ్ మాత్రమే కాదు.. జాకుబ్ వాద్లెచ్, జూలియన్ వెబర్ కూడా ఉన్నారు. చివరి త్రో వరకూ ఇతర త్రోయర్ల గురించి ఆలోచిస్తూ ఉండాలి. అయితే స్వదేశంలో మాత్రం ఈ పోరును భారత్-పాక్ మ్యాచ్‌గా చూశారు’ అని తెలిపాడు.
దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు
ఆ మధ్యకాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో దళితుడిపై మూత్రం పోసి హింసించారు. తరువాత దళితుడిని ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని చితకబాదారు. ఇక ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత యువకుడిని కొట్టి అతనితో చెప్పులు నాకించాడు. ఇలాంటి ఘటనలు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి చర్యలను అరికట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా దేశంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమ మేకలను దొంగలించారనే కారణంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరామ్‌పుర్ తాలుక పరిధి హరేగాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE… హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు
హైదరాబాద్ వేదికగా తొలిసారి WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే.. సెప్టెంబర్ 8న గచ్చిబౌలి స్టేడియం వేదికగా సూపర్ ఫైట్ జరుగనుంది. ఈ సూపర్ ఫైట్‌లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ప్రత్యేక ఆకర్షణ గా డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ జాన్ సినా నిలువనున్నారు. 17 ఏళ్ల తర్వాత జాన్ సిన ఇండియా కి రానుండటం విశేషం. అయితే.. ఈ సూపర్ ఫైట్ ఈవెంట్‌కు హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. నెల రోజుల ముందే టికెట్లు సోల్డ్ ఔట్ బోర్డు పెట్టేసింది బుక్‌మైషో. 500 రూపాయల నుంచి 17 వేల రూపాయల వరకు టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించారు.
ఒక్క టికెట్ కూడా అందుబాటులో లేదని.. అన్నీ అమ్ముడుపోయాయి అని బుక్ మై షో వెల్లడించింది. ఈ సూపర్ ఫైట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్ హైదరాబాద్ కి రానున్నారు. విమెన్ ఛాంపియన్ రియా రిప్లే కూడా ఈ ఫైట్‌కు రానున్నారు. అంతేకాకుండా.. WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ తోపాటు ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి WWE స్టార్‌లు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో సందడి చేయనున్నారు.
బీఆర్‌ఎస్ చేపట్టిన కార్యక్రమాల గురించి ఖర్గేకు సరైన అవగాహన లేదు
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేయడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఏంటని బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత, అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వద్ద సరైన సమాచారం లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ఖర్గేకు సరైన అవగాహన లేదని శ్రవణ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి పోడు భూములకు సంబంధించి తల్లిదండ్రులు పట్టాలు పొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డి సీతక్క కుటుంబంలోని ఒక ముఖ్యమైన ఉదాహరణను ఆయన హైలైట్ చేశారు. భూ పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలకు ఇది విరుద్ధమని ఆయన సూచించారు.
ఫ్రాన్స్ సంచలన నిర్ణయం.. స్కూళ్లలో ముస్లిం “అబయా దుస్తుల”పై నిషేధం..
యూరోపియన్ దేశం ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక, ఉదారవాదానికి విలువనిచ్చే అక్కడి ప్రభుత్వం సంప్రదాయ ముస్లిం వస్త్రధారణపై నిషేధం విధించింది. ఫ్రాన్స్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం అబయా వస్త్రాలను నిషేధించింది. కొంత మంది ముస్లిం మహిళలు వదులుగా ఉండే, పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే, అబయా అని పిలువబడే దుస్తులను ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ విద్యామంత్రి ఆదివారం తెలిపారు. యూరోపియన్ దేశం ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. లౌకిక, ఉదారవాదానికి విలువనిచ్చే అక్కడి ప్రభుత్వం సంప్రదాయ ముస్లిం వస్త్రధారణపై నిషేధం విధించింది. ఫ్రాన్స్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ముస్లిం అబయా వస్త్రాలను నిషేధించింది. కొంత మంది ముస్లిం మహిళలు వదులుగా ఉండే, పూర్తిగా శరీరాన్ని కప్పి ఉంచే, అబయా అని పిలువబడే దుస్తులను ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ విద్యామంత్రి ఆదివారం తెలిపారు.