CM Jagan : ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, అనురాగానికి చిహ్నం రాఖీ వేడుక. అయితే.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను!’ అని ఆయన పోస్ట్ చేశారు.
Also Read : AI : వ్యాపారుల కోసం సరికొత్త ఏఐ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్..
Also Read
ఇదిలా ఉంటే.. నేడు సీఎం జగన్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగ్గంపేట మండలం ఇర్రిపాక చేరుకుంటారు. అక్కడ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసంలో ఆయన కుమార్తె వివాహ వేడుకకు హాజరవుతారు.అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read : Mutual Fund: లక్ష పెట్టుబడి పెడితే.. కోటి రూపాయల రాబడి.. మ్యాజిక్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్
అయితే.. సీఎం జగన్ సెప్టెంబర్ 2వ తేదీన కడపలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం కార్యక్రమాల నేపథ్యంలో మంగళవారం ఇక్కడ అధికారులతో సమావేశమయ్యారు. ఒకటి, రెండు రోజుల్లో సీఎం జిల్లా పర్యటన ఖచ్చితమైన షెడ్యూల్‌ని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీఎం కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల వేదిక వద్ద ప్రొటోకాల్ విధివిధానాలు కచ్చితంగా పాటించాలని అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!