మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విపత్కర పరిస్దితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.. ప్రతీ రెండు గంటలకు అప్ డేట్స్ తీసుకుని తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దు అని మంత్రి కోరారు. తీర ప్రాంతాల్లో ఇళ్లలో ఇబ్బందులు ఉంటే పునరావాస కేంద్రాలకు తరలి రావాలి.. మత్య్సకార గ్రామాలను గుర్తించి ప్రజలను తరలిస్తున్నాం.. పంట నష్టం అంచానా వేసేందుకు అధికార యంత్రాంగం పని చేస్తుంది అని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
Read Also: Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..? నిర్ణయం పూర్తైందన్న రాహుల్ గాంధీ..
దాదాపు 10 వేల ఎకరాల పంట నీట మునిగినట్లు సమాచారం అందుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున అన్నీ రకాల కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఇక, కొండేపి మండలం చిన్న వెంకన్నపాలెం దగ్గర మిచాంగ్ తుఫాన్ దాటికి భారీ వృక్షం నెలకొరిగింది. భారీ ఈదురు గాలులకు రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం పడింది. దీంతో కొండేపి- టంగుటూరు మధ్య రాకపోకలు అంతరాయం నెలకొన్నాయి. ఇక, భారీగా ట్రాఫిక్ నిలిచింది. తుఫాన్ కారణంగా వర్షానికి యర్రగొండపాలెం మండలం మొగుల్లపల్లిలో పలు ఇళ్లు కూలిపోయాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లో పొగాకు, మినుము, శెనగ పంట పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చే దశలో పంటలు నీటి పాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. రైతులకు సీఎం జగన్ అండగా ఉంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.