ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో దానిని కొనసాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో…
ఏపీ సిఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ వల్ల సిఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలని భావించినా.. జగన్ మాత్రం పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం రోజున సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్ళి..…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో, వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. కరోనా వస్తే పారాసేటమాల్, బ్లీచింగ్ సరిపోతుందని జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడిందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా హాస్పిటల్స్ కు వెళ్లి పేషంట్లకు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నాలుగు గోడల నుండి బయటకు రావడంలేదని..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రాణాలు…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాదు ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.…
తాడిపత్రి అర్జాస్ స్టీల్స్ వద్ద 500 బెడ్ల కోవిడ్ తాత్కాలిక ఆసుపత్రిని వర్చువల్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కేవలం రెండు వారాల రికార్డు సమయంలో 11.50 ఎకరాల విస్తీర్ణం, లక్ష చదరపు అడుగులు, అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ను సిఎం జగన్ ఆదేశాలతో నిర్మించారు. ప్రతీ పేషెంట్ బెడ్ వద్ద ఆక్సీజన్, ప్రతీ 30 బెడ్లకు నర్సింగ్ స్టేషన్, 200 మంది నర్సులు, 50 మందికి పైగా డాక్టర్లు,…
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్, ఆ పార్టి నేతలు. ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని, కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని గవర్నర్ కు వినతి పత్రం అందచేసిన సాకే శైలజానాథ్ అనంతరం మాట్లాడుతూ… దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. మాటలు చెప్పకుండా ఏకీక్రుత విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలి. భారత్ బయోటెక్ మంచి నీటి బాటిల్ కన్నా తక్కువ ధరకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కానీ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారు.…
సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో తాడిపత్రిలో యుద్ధప్రాతిపదికన 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మించారు. మరి కాసేపట్లో వర్చువల్ ద్వారా తాడిపత్రి కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్… 5.50 కోట్ల రూపాయల వ్యయంతో 13.56 ఎకరాల్లో కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం చేసారు. జర్మన్ హ్యాంగర్ విధానంలో ఆసుపత్రి నిర్మించారు. దీంతో రాయలసీమ కోవిడ్ బాధితులకు అందుబాటులోకి మరిన్ని ఆక్సిజన్ బెడ్స్ రానున్నాయి. అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల ప్రజలకు…
సీఎం జగన్ పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణంకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారని..ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారని వెల్లడించారు. కేంద్రం ఇంటి నిర్మాణానికి నిధులు కల్పిస్తుందని…భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం చేస్తోందన్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించే చర్యలు తీసుకుందని తెలిపారు. సిఎం జగన్ అభిమతం అన్ని ప్రాంతాలను…
పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసిన సర్కార్.. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది.జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్,…
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతోనే మందు పంపిణీ చేస్తానని.. మూడు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించి ముందు ఎప్పుడు పంపిణీ చేసిందో వెల్లడిస్తానని తెలిపారు. పోలీసులు నిర్బంధించలేదని, రక్షణ కల్పించారని..ఉన్నవాళ్ళకి కాదు లేని వాళ్లకు కూడా మందు పంపిణీ చేశానన్నారు. మందుకు కావలసిన వనమూలికలు సమృద్ధిగా ఉన్నాయని..ఇప్పటి వరకు…