దేశంలో పెట్రోల్ ధరలు మండి పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టేశాయి. తాజాగా ఏపీలోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్ ధరలు పెంచడంపై సిఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టి జగన్ రికార్డు సృష్టించాడని లోకేష్ ఫైర్ అయ్యారు. “IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో క్రిస్‌గేల్ సుడిగాలి సెంచరీ రికార్డుని IPL(ఇండియన్ పెట్రోల్ లీగ్)లో 3 కేపిటల్స్ కెప్టెన్ బాదుడు రెడ్డి బద్దలు కొట్టారు. దేశంలోనే లీటర్ పెట్రోల్ రేటు సెంచరీ (వంద) దాటిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టి, అవినీతిలోనూ.. ధరలు పెంచడంలోనూ తానే ఏ1 అని సిఎం జగన్ నిరూపించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్యాక్స్‌లు తగ్గించుకుంటే, పెట్రోల్ డీజిల్ తక్కువ ధరకే ఇవ్వొచ్చని ఫేక్ కబుర్లు చెప్పారు బాదుడురెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చాక మామూలు ట్యాక్స్‌లను రెండింతలు చేసి, దానికి జే ట్యాక్స్ యాడ్ చేసి మరీ పెట్రోల్ ధర సెంచరీ కొట్టించారు.” అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
ధరలు పెంచడంలోనూ తానే ఏ1 అని @ysjagan నిరూపించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్యాక్స్‌లు తగ్గించుకుంటే, పెట్రోల్ డీజిల్ తక్కువ ధరకే ఇవ్వొచ్చని ఫేక్ కబుర్లు చెప్పారు బాదుడురెడ్డి.(2/3)
— Lokesh Nara (@naralokesh) May 31, 2021