ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో సమస్యను తన లేఖలో లేవనెత్తారు. నవ ప్రభుత్వాల కర్తవ్యాల పేరుతో ఈసారి రఘురామ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షల రద్దుపై ఈనెల 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. read also : నేడు కేంద్ర కేబినెట్ కీలక…
మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల పై మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని.. లంకలో పుట్టినోళ్లు అందరు రాక్షసులేనని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు ఎవరూ అన్యాయం చేసినా.. ఊరుకునేది లేదని స్పష్టం…
తెలంగాణ ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతోందని..ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ 800 అడుగులు లోపు ఉంటే చుక్క నీరు తీసుకునే పరిస్థితి లేదని.. మాకు కేటాయింపులు ఉన్న నీటిని వాడుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే అక్రమమని చెప్పటం ఎంత వరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నట్టెం,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు అన్నీ కేటాయింపులకు అదనంగా వాడుకోవటం కోసమే అన్నది వాస్తవం కాదా? కాల్వల వైడనింగ్ చేస్తున్నాం…అది కూడా తప్పంటే ఎలా? అని నిలదీశారు.…
ఏపీలో ఓ 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ రాసింది. మా అమ్మ చనిపోయి 40 రోజులైంది. కానీ ఇంకా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ లేఖలో తెలిపింది. మేన మామ ఆర్షిత్ రెడ్డి సహాయంతో డెత్ సర్టిఫికెట్ కోసం లేఖ రాసింది.లేఖలో ముఖ్యమైన ”పంచాయతీ సెక్రెటరీ కి అర్జీ పెట్టుకుంటే మీ అమ్మ నెల్లూరులో చనిపోయింది నేను డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేను అని సమాధానం చెప్పారు. పురపాలక సంఘం నుంచి డెత్ సర్టిఫికెట్ రావాలని…
టిడిపి, బిజేపిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. టీడీపీ-బీజేపీ నేతలు జత కలిశారా అనే అనుమానం వస్తుందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు రూ. 399 కోట్లు ఉన్నాయని… ఈ సీజనుకు సంబంధించి రూ. 1200 కోట్లు ఇంకా కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇక్కడి బీజేపీ నేతలు వాటిని రిలీజ్ చేయించేలా చర్యలు తీసుకుని క్రెడిట్ తీసుకోవచ్చని.. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలను మేము అనుసరిస్తున్నామని…
జగన్ చెడ్డీ గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అని అన్నారు టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కేంద్రంగా రెండు వేల 500 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని అన్నారు. దానికి సిబిఐ దర్యాప్తు అవసరం. పర్యావరణ హితం కాకుండా, మైనింగ్ పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఎస్ఇబి దాడులు ఏవి ప్రశ్నించారు. ఇసుకకు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ప్రభుత్వ…
కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని.. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు…
సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని సర్కార్ విడుదల చేసింది. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న మాట ఇచ్చామని.. ఆటోడ్రైవర్లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాదుడు ఎక్కువైంది, పెనాల్టీలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందారని.. అప్పులు తెచ్చి ఇన్సూరెన్స్, మరమ్మతులు, పెనాల్టీలు కడుతున్నామని చెప్పారని వెల్లడించారు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ…
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని లేఖలో కోరారు లోకేష్. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ప్రతిష్టని దెబ్బతిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థుల్లో నెలకొన్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. వరుస లేఖలతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రఘురామరాజు. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాలను ఈ లేఖలో ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే… పెళ్ళికానుక సహాయం పెంచుతామని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ సాయాన్ని లక్ష రూపాయలకు…