అమరావతి : కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా థర్డ్ వేవ్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 ద్వారా పిల్లలకు చికిత్స 24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్ టెలీ సేవలు తీసుకు రావాలని..అలాగే 150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు నిర్వహించాలని పేర్కొన్నారు. ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలని… ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలని…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదం మళ్లీ రాజుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నీటి వివాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ”వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే… సీఎం జగన్ గజ దొంగ” అన్న సందర్భాలు ఉన్నాయి. అటు ఏపీ మంత్రులు కూడా అదే స్థాయిలో తెలంగాణ ప్రభుత్వపై…
ఏపీ ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు దక్కాల్సిన వాటా విషయంలో రాజీ పడేదే లేదని.. ఎన్జీటీ తీర్పులను ఏపీ గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలని.. తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నీళ్ల తరలింపు పరాకాష్టకు చేరిందని.. కేంద్రానికి అబద్ధాలు చెప్తూ అక్రమంగా ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని ఫైర్ అయ్యారు. read also :తెలంగాణ…
ఎపి ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగావున్నప్పుడు జరిగిన ఆందోళనలు నిరసనలు కొన్ని ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి దాఖలైన 11 కేసులను రద్దుచేయడంపై హైకోర్టు జడ్జి కె.లలిత సుమోటాగా విచారణ చేపట్టడం ఇప్పుడు తాజా వివాదంగా వుంది. ప్రభుత్వాలు మారినపుడు అంతకు ముందరి సాధారణ కేసులు కొన్ని రద్దు చేయడం జరుగుతుంటుంది.వాటినిప్రతిపక్షం ఆక్షేపించడం కూడా జరుగుతుంటుంది గాని ఇక్కడ హైకోర్టు సుమోలాగా తనకు తాను తీసుకోవడవంపైనే ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది.ఈ కేసుల రద్దులో కొన్ని ప్రభుత్వ జీవోల ద్వారానూ…
కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమేనని… ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..?అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని.. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా…
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటి తీర్పు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు తేలితే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని, తెలంగాణ సర్పంచ్ ల సంఘం నేత గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను…
మహాబూబ్ నగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసిఆర్ పై బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టులపై కేసిఆర్ కు చిత్తశుద్దిలేదని… ఆర్డిఎస్ పై ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రముఖ్యమంత్రి జగన్ ల మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ఆర్డిఎస్ నుండి ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కేసిఆర్ కు సోయిలేదని.. తెలంగాణ వచ్చినాంక ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు. read also: కొత్త కాంతులతో యదాద్రి ఆలయం.. ఆర్డిఎస్ వద్ద కుర్చి…
మహిళల భద్రతపై సీఎం వైయస్.జగన్ నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో పాల్గొన హోంమంత్రి సుచరిత అనంతరం మాట్లాడుతూ… దిశ యాప్ వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ యాప్ ఉంటే ఆపద సమయంలో బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. ఫోను ను మూడు సార్లు కదిపితే దగ్గరలోని పోలీసులకు సమాచారం చేరుతుంది అన్నారు. నది ఒడ్డు మొత్తం సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం కాదు సీసీ కెమెరాల ఏర్పాటు సంబంధించి కూడా చర్యలు…
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఏపీ సీఎం వైయస్.జగన్ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు హాజరయ్యారు. అయితే మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. దాన్ని ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలి ఇంటింటికీ వెళ్లి మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసేలా చూడాలి అన్నారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా…
ఏపీ నీటి ప్రాజెక్టులు, నాయకులు, ప్రజలపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజలను ఉద్ధేశించి చేసినవి కాదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలు నష్టపోతారనే మా బాధ అని… ఏపీ నేతలు ఈ విషయాన్ని గుర్తించాలని తెలిపారు. ఎవరిపై ఉద్యమం చేస్తారని సోము వీర్రాజు అంటున్నారని… నీటి వాటాను తేల్చాలని కేంద్రంపై…