అనంతపురం : ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు అర్థం కానీ రీతిలో వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని…చెత్త మీద కూడా పన్ను వేసే చెత్త పాలన సీఎం జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో జగన్, పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా కనపడటం లేదని ఎద్దేవా చేశారు. read also : రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు ! ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడంలో మాజీ…
సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు. read also :…
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో ఏపీ కావాలనే దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని.. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ను గుర్తించడం లేదని పర్యావరణ అనుమతులు ఎన్జీటీ స్టే ఉన్నా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు కాలువకు నీటిని ఎత్తిపోతల…
సీఎం కేసీఆర్, జగన్‌లపై ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. జగన్, కేసీఆర్ లు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వారిద్దరి నటన రావుగోపాల్ రావు.. అమ్రిష్ పురి నటనను మించి పోయిందని చురకలు అంటించారు. జల జగడం.. ఓ పెద్ద డ్రామా అని.. రాయలసీమకు వెళ్ళినప్పుడు కేసీఆర్ రతనాల సీమ చేస్తానని చెప్పారని..జగన్ ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపాడని ఆరోపణలు చేశారు. read aslo : ఏపీ కరోనా…
ఐదు దశాబ్దాలుగా నలుగుతోన్న బ్యారేజ్ అంశంపై ఎట్టకేలకు ట్రైబ్యునల్ నుంచి సానుకూల తీర్పు వచ్చింది. ఆ తీర్పుతో ఖుషీ అయ్యారు అధికార పార్టీ నాయకులు. ఆ విజయం తమదే అని ప్రచారం చేసుకున్నారు కూడా. త్వరలో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు గుప్పించారు. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్. ఇంతకీ నేతలకు మింగుడు పడని అంశాలేంటి? దశాబ్దాల కల.. కలేనా? 1961లోనే నేరడి బ్యారేజీ కోసం శంకుస్థాపన నేరడి బ్యారేజ్.…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు ముఖ్యమంత్రి జగన్ వేరు వేరుగా లేఖ రాశారు. తెలంగాణతో ఉన్న జల పంచాయతీ పై ప్రధాని మోడీకి ఐదు పేజీల లేఖ రాశారు జగన్. అంతేకాదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కో కు రాసిన లేఖ, విద్యుత్ ఉత్పత్తి కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన…
రెండున్నరేళ్ల డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. ఎంత లేదన్నా పవర్ పవరే కదా? దాన్ని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తాను సశ్చీలుడునని చెప్పుకొంటున్నారు ఓ డిప్యూటీ సీఎం. అంతేకాదు చివరకు తనకంటే వయసులో చాలా చాలా చిన్నవాడైన సీఎం జగన్ కాళ్లమీద పడ్డారు. ఇవన్నీ ఆయన పవర్ని కాపాడతాయా? నిజాయితీగా పేదవారి కోసం పనిచేశానని చెబుతున్నారుఎవరు కనిపించినా ఒకటే పాట పాడుతున్న డిప్యూటీ సీఎం! మంత్రి పదవి రాగానే ఏసీ…
జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న పి.వి సింధు, ఆర్. సాత్విక్ సాయిరాజ్, రజనీలకు విషెస్ చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్ అందజేసిన సీఎం వైఎస్ జగన్… విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేశారు. రజనీ (ఉమెన్స్ హకీ) చిత్తూరు జిల్లా,…
రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినేట్ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణపై చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా పేదల ఇళ్ల స్థలాల క్రమబద్దీరణ చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ. 5900 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. read also : ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ , ఇంటర్ పరీక్షలు…