సీఎం జగన్ ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ఓ ఎత్తు అయితే.. జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకూడదంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తుగా కనిపిస్తోంది. GOIR వెబ్ సైట్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచే ప్రక్రియ 2008 నుంచి ప్రారంభమైంది. ఈ ఆనవాయితీని జగన్ సర్కార్ పక్కకు పెట్టింది. ఈ విధానానికి స్వస్తి పలకాలంటూ అన్ని శాఖల కార్యదర్శలకు మెమో పంపింది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైనులో పెట్టకూడదని డిసైడ్ అయినట్టు…
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం…
నాడు-నేడు కార్యక్రమంతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రూపుదిద్దుకున్న ఓ పాఠశాలను నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకకు ఇక్కడే శ్రీకారంచుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదువుతున్న 47 లక్షల 32 వేల మంది విద్యార్థులకు… ఈ విద్యా కానుకను అందిస్తారు. జగనన్న విద్యాకానుక కిట్టులో బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు,…
బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు…
ఉద్యోగాల భర్తీ వైపు జగన్ సర్కార్ ఒక్కో అడుగూ వేస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా భారీగా ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం.. తాజాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలలోనే ఏపీపీఎస్సీ నుంచి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటాలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. కానీ, ఈ విషయంలో చిన్నపాటి సాంకేతిక అడ్డంకిని ఏపీపీఎస్సీ గుర్తించింది. Read: పవన్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్…
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలని… అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని… అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని…ప్రతి నాలుగు వారాలకు…
తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి నీటి వివాదాలు ఉండవద్దని కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రెండు బోర్డుల చైర్మన్ లు హాజరు అయిన సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. బోర్డు సమావేశాలకు హాజరు కాకుండా తెలంగాణ సీఎం సాధించింది ఏంటో చెప్పాలి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశంలో కేసీఆర్ ఇంతా దుర్మార్గపు సీఎం ఎక్కడా లేరు. బోర్డు సమావేశంకు హాజరు అయితే ఏపీని అక్రమ ప్రాజెక్టులపై నిలదీసే అవకాశం ఉండేది. దేశంలో…
ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో…
వైయస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన నేతన్నలకు ఆర్థిక సహాయం కార్యక్రమం ప్రారంభించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాదాపుగా 80 వేల మంది చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది: రూ.192 కోట్లు జమచేస్తున్నాం. నేతన్నలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు నా పాదయాత్రలో స్వయంగా చూశాను. ప్రతి జిల్లాలో చేనేతల సమస్యలు నాకు చెప్పకున్నారు అని సీఎం అన్నారు. వారి గోడును బహుశా నేనెప్పటికీ మరిచిపోలేను. మగ్గంమీద బతుకుతున్న చేనేత కుటుంబానికి అక్షరాల రూ.24వేల…