తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రోజురోజుకీ దివాలా తీస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేశామని చెప్పినా ఏమి చేయలేకపోతున్నారు. విద్యావిధానం మీద స్పష్టత లేదు.. తెలుగును చంపేసే పరిస్థితి తీసుకొచ్చారు. మీ పరిపాలన గురించి ప్రజలకు అర్థమవుతోంది అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ సలహాదారులు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ బిల్లులు చెల్లించలేని బతుకు మీది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కనీసం టెండర్లకు పిలిచినా ఎవరు రావడం లేదంటే…
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి…
రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… దేశ చరిత్రలో తొలిసారి విద్యలో 10 శాతం ఇ.బి.సి, 27 శాతం ఒ.బి.సి రిజర్వేషన్లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అన్ని ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం జారీ చేసిన గెజీట్ తో కేసీఆర్ నోటికి తాళం పడింది. నదీ జలాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇకనైనా తన పోకడలు మార్చుకోవాలి…
పలాస – కాశీబుగ్గ మున్సిపాల్టీకి రెండో వైస్ ఛైర్మన్ గా ఒక దళిత సోదరుడు ఎన్నిక కావడం పలాస చరిత్రలో గొప్ప అధ్యాయం అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచి సోషలిస్టు. వెనుకబడిన, దళిత గిరిజన వర్గాలకు చెందిన ఐదుగురిని ఉపముఖ్యమంత్రులుగా చేశారు. అన్ని రాజకీయపదవులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జనగ్ కే దక్కుతుంది. ఇక చెత్త పై పన్నువేసే విషయంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం 50 లక్షల విరాళం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని విఐటి ఫౌండర్ & ఛాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ కలిశారు . ఈ సందర్బంగా విఐటి విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ అత్యంత ప్రతిష్ట్మాకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తింపు పొందిందని మరియు విఐటి-ఏపీ విశ్వవిద్యాలయ పురోగతిని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి మొదటి విడతలో 25…
అమరావతి: కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్ సిలెండర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు తదితర వాటి నిర్వహణకోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని.. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు ఉంచాలని ఆదేశించారు. Read Also : డిస్నీ ప్లస్…
ఒక్కొ ఇంటికి 1.80 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. నిర్ధేశించిన మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. మహిళలకు ఇళ్లు కాదు.. ఆస్తి ఇస్తున్నాం అన్నారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఇళ్ళు గ్రౌండ్ అయ్యాయి. లేఔట్ల వద్దే లబ్ధిదారులకు ఇసుక, స్టీల్, సిమెంట్ సరఫరా చేస్తాం. పేదల ఇళ్ల నిర్మాణానికి చంద్రబాబు పదేపదే అడ్డుపడుతున్నారు. వచ్చే రెండేళ్లలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తాం. జగన్ సర్కార్ కు…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలతో హిందూమతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గోవధచట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాట్లాడడంపై ఆగ్రహం. గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా.. భారతీయులను కించపరస్తారా అని పరామర్శించారు. ఎమ్మెల్యే రాజీనామా చేయాలి లేదా ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. తరచుగా హిందువులను కించపరిచే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలి. దేవాలయాలు ధ్వంసం చేసిన…