ఒకవైపు టికెట్ల వివాదం, మరో వైపు థియేటర్లలో తనిఖీలు, యజమానుల మూసివేతలు ఏపీలో వినోదరంగాన్ని కుదిపేస్తున్నాయి. సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి ప్రధానమయింది. ప్రజలకు వినోదాన్ని అందించే సినిమాపై వివాదాలు నెలకొనడం.. క్రమంగా రాజకీయ రంగు పులుముకోవడం కలవరం కలిగిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన నిబంధనలతో నష్టపోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో సినిమాలంటే 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు ఆడాలని భావించేవారు. కానీ ఇప్పుడు సినిమాలంటే మొదటి వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడంతా…
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా…
విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ ..వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ ఒక మేల్కొలుపు లాంటిదని, వైసీపీ పతనంప్రారంభమయిందన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో…
సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్‌నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ర్టంలోని పాడి రైతులను మోసగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయాలని…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని శ్రీకాంత్ సాధించారు. Read Also:గుడ్‌న్యూస్: ఆ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ… ఈ నేపథ్యంలోనే…
బీజేపీ సభపై మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సబ టీడీపీ అనుబంధ విభాగం సభలా బీజేపీ సభ జరిగింది. రాష్ట్రంలో బీజేపీ లేదు.. అందుకే ప్రజల భావోద్వేగాలు ఏంటో వాళ్ళకు తెలియదు. రాష్ట్రంలో బీజేపీ శక్తి ఏంటో వాళ్ళకూ తెలుసు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీజేపీ సభ జరిగిందన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఒక మాయా ఫకీరు. దేశ చరిత్రలో మొదటి సారి ఒక జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ నేతృత్వంలో పని చేయటంచంద్రబాబు గంట…
వైసీపీలో కొందరు నేతలు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వుంటారు. అందునా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్లు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింది. తగ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియానే అన్నారు ఆనం. మాఫియాలు ఈ…
నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు. అందుకే…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో వర్చువల్ విధానంలో పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకం అమలు కానుంది. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన లాభాలు వస్తాయని ఇప్పటికే జగన్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.