ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో సొంత కేడరే ఆయనకు పక్కలో బల్లెంలా తయారైందట. విపక్షాల సంగతి ఎలా ఉన్నా.. స్వపక్షం నుంచే ఎమ్మెల్యేకు అవినీతి ఆరోపణలు తప్పడం లేదు. సోషల్ మీడియాలోనూ కామెంట్స్.. పోస్టింగ్స్‌తో కేక పెట్టిస్తున్నారు. వైసీపీలోని వ్యతిరేకవర్గం దెబ్బకు ఉక్కిరిబిక్కిరి..!కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో కైకలూరు ఒకటి. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా బోర్డర్‌లో ఉంటంతో.. ఇక్కడ ఎవరు గెలిచినా ప్రత్యేకమే. అటువంటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు దూలం…
ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి. మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ,…
ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షాకిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది ఏపీజీఈఏ. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది.…
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరించారు. మనదైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ఉన్న ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి భోగి మంటలు, రంగ…
ఏపీలో సీపీఐ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి తరచూ లేఖలు రాస్తుంటారు సీపీఐ నేత రామకృష్ణ. తాజాగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ…
గుంటూరు జిల్లాలో నేడు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకుంటారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు బయలుదేరి 11గంటలకు హోటల్ ను ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లోనే…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.…
ఏపీలో ఉన్న వైసీపీది మతతత్వ ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆత్మకూరులో అనుమతి లేకుండా రెండు రోజుల్లో ఇళ్ల మధ్య మసీదులు కట్టారని, ఇళ్ల మధ్య మసీదు వద్దని చెబితే చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎంతోమందిని భయబ్రాంతులకు గురి చేశారని, చట్టాన్ని రక్షించాల్సిన ఉప ముఖ్యమంత్రి కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని, టీడీపీ నుండి బీజేపీకి వచ్చిన నేతలను కోవర్టులు…
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప అడుగు ముందుకేసింది. రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి, మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలను తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని…