Lokayukta: కర్నూలులో లోకాయుక్త ఆఫీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు.
తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి స్వాగతం పలికారు. లోకాయుక్త సంస్థ చైర్మన్ ఛాంబర్ లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. లోకాయుక్త రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, లోకాయుక్త సంస్థ డీఎస్పీలు పాల్గొన్నారు. లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.
Also Read
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
లోకాయుక్త ను హైదరాబాద్ నుంచి పూర్తిగా కర్నూలుకు తరలించామన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. కర్నూలు నుంచే లోకాయుక్త కార్యకలాపాలు నిర్వహిస్తాం.ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం. ప్రభుత్వం, అధికారులు నుంచి పని జరగకుంటే ఫిర్యాదు చేయొచ్చు. సరైన కారణంతో అధికారుల పై ఫిర్యాదు చేయవచ్చన్నారు. రెవెన్యూ అధికారులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
రెవెన్యూ అధికారుల వల్ల రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు నెల రోజుల తర్వాత పరిష్కారం కాకుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చు… విచారణ చేపట్టి చర్యలకు సిఫార్సు చేస్తాం. అవసరమైతే మేమే శిక్షలు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. కర్నూల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చాలా అవినీతి జరిగింది. కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు. మేము ఇచ్చిన సూచనలు ప్రభుత్వ పాటించకుంటే నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళతాం. రిటైరయిన అధికారుల పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. చెరువులు, కుంటలు, సంబంధించి పట్టాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సుప్రీం కోర్ట్ చెప్పింది. అయినా సరే అధికారులు వాటికి పట్టాలు ఇస్తున్నారన్నారు.
Read Also: Anil vs Kakani: మంత్రి అడ్డాలో మాజీ మంత్రి హల్ చల్
తాజావార్తలు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!