ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలిలాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రివర్స్ పాలనలో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయని, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యానని తెలిపారు. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే…
1. నేడు హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,700లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,040లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లకు చేరింది. 2. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి డీజిల్ సెస్‌ను పెంచారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కిలోమీటర్లకు రూ.5 నుంచి రూ.45కు పెంచారు. 3. నేడు…
ఉపఎన్నిక జరుగుతున్న ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో క్రమంగా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 13 వేల మంది. 2014లో ఇక్కడ వైసీపీకి 33 వేలు, 2019లో 22 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. మేకపాటి గౌతంరెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆయన సోదరుడు విక్రంరెడ్డే వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ ఎలా ఉన్నా.. ఉపఎన్నికలో మాత్రం లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నారు నాయకులు.…
ఏపీలో వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం నాడు సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాకిచ్చారు. ఎమ్మెల్యేల పని తీరుపై ఆయన పవర్ పాయింట్…
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామని తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సీఎం జగన్ అడిగారని.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా ఉందో చర్చించామని వెల్లడించారు. కోటి 40 లక్షల…
ఏపీలో పదవతరగతి పరీక్షా ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలా జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదవతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇంట్లో తల్లితండ్రులదే తప్పు అని నెపం వేస్తారా? అని ఆయన అన్నారు. 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి.. ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకీ ఫీజులు తీసుకోకూడదు. పట్టుమని…
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అనుమతి తీసుకుని సమావేశానికి పలువురు నేతలు హాజరుకాలేదు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి సమావేశానికి వచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వర్క్‌షాపును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ *నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు *తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి *మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్న సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ *నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న జాతీయ హరిత…
ఏపీలో పదవతరగతి పరీక్షాల ఫలితాల తీరుపై విపక్షం టీడీపీ మండిపడుతోంది. విమర్శలు, ట్వీట్లతో దుమారం రేగుతోంది. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం లేదన్నారు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. విద్యామంత్రి నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై నెట్టడం తప్పు. విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలు ఆపడం అన్యాయం. ఇతర రాష్ట్రాలు కోవిడ్అప్పుడు విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద…