కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Prashanna Kumar Reddy) అధికార పార్టీలో సంచలన నేత. ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ (NTR) కుమారులకు ఆయన మీద ఎందుకు ప్రేమ వచ్చింది. చివరి రోజుల్లో కనీసం ఆ పెద్దాయనకు అన్నం పెట్టారా…? మా గుండెల్లో ఇప్పటికీ ఎన్.టి.ఆర్.ఉన్నారు. ఎన్టీ రామారావుని మేం ఎప్పటికీ మర్చిపోం.. ఆయన ఆశీర్వాదం వల్లే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిని అయ్యాననన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంతో మా తండ్రికి అన్యాయం జరిగిందని ఆయన కుమారులు అనడం సరికాదు.
Read Also:KTR Interaction With Basara IIIT Students Live: బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ తో కేటీఆర్ మాటామంతీ
ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు లాక్కొన్నపుడు బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించినపుడు పురందేశ్వరికి ఎన్.టి.ఆర్.కనిపించలేదా? వైస్రాయ్ హోటల్ వద్ద దేవుడు లాంటి ఎన్.టి.ఆర్.మీద చెప్పులేయించడం వల్లే చంద్రబాబుకు ఈగతి పట్టింది.. యూనివర్సిటీ పేరు తీసేసినందుకు గగ్గోలు పెడుతున్నారు.ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి,జగన్మోహన్ రెడ్డి లు ప్రజా నాయకులు.. అసలైన ఎన్టీ రామారావు అభిమానులు ఇళ్లల్లో ఉన్నారు. ఎవ్వరు బయట లేరు తెలుగుదేశంలో ఉన్న వారంతా నకిలీ నేతలే అని కామెంట్ చేశారు ప్రసన్నకుమార్ రెడ్డి.
Read Also: Minister KTR: ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్దికి ఆమడదూరంలో ఉండేది కాని..