రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. కుప్పంలో జగన్ కు నీరాజనాలు పట్టారు. దీనిని టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు మంత్రి కాకాణి. కుప్పంలో జగన్ చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చూసి ప్రజలు జగన్ ను సంతోషంగా ఆదరించారు. 1989 నుంచి కుప్పం ఎం.ఎల్.ఏ.గా ఉన్న చంద్రబాబు ఏమీ చేయలేదు. కుప్పంలో డిగ్రీ కళాశాలను కూడా వై.ఎస్.ఆర్.మంజూరు చేశారు. కుప్పం కు చంద్రబాబు విజిటింగ్ నేతగా మారారు. 33 ఏళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నా సొంత ఇల్లు లేదు.
ప్రజల్లో తనపై వ్యతిరేకత వస్తుండటంతో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు. కుప్పంలో రెవిన్యూ డివిజన్ పెట్టమని జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. జగన్ వెంటనే రెవిన్యూ డివిజన్ చేశారు. గుడివాడలో మహిళలు రెచ్చగొట్టారు. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం కు పారిపోయారు. కొడాలి నాని వరుసగా గుడివాడ నుంచి గెలుస్తున్నారు. జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు వచ్చాయి.చంద్రబాబు ప్రైవేట్ వారిని ప్రోత్సహించారు. ఎన్.టి.ఆర్. పేరు తలిచే అర్హత చంద్రబాబు కు లేదు. 108….104 వైద్య సర్వీసులను నీరు గార్చారు. పార్టీ సభ్యత్వ పుస్తకాల్లో కూడా ఎన్.టి.ఆర్. ఫోటో ను తొలగించిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు మంత్రి కాకాణి.
Read Also: Punjab: గవర్నర్ వర్సెస్ సీఎం.. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి
విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులను జగన్ తీసుకువచ్చారు. చంద్రబాబు చదువుకున్న స్కూల్ ను కూడా నాడు..నేడు లో జగన్ అభివృద్ధి చేశారు. ఎన్.టి.ఆర్.జిల్లా పేరు పెట్టి జగన్ ఆయాణపై వున్న అభిమానాన్ని చూపారు. అమరావతి రైతుల యాత్ర కు అన్నీ చంద్రబాబే సమకూరుస్తున్నారు..ఆయన కనుసన్నల్లోనే యాత్ర జరుగుతోంది. ఇది అందరికీ తెలిసిందే. అమరావతి లో. కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకు లోకేష్ ను ఓడించారో గుర్తించాలి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదు.
వైద్య రంగానికి వై.ఎస్.ఆర్.చేసిన సేవలను గుర్తుంచుకునే హెల్త్ యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టారు. ఇది సముచితమని మేము..ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు బతికి ఉన్నంతవరకూ నారా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు. నందమూరి కుటుంబాన్ని పట్టించుకోరు. జూనియర్ ఎన్.టి.ఆర్.ను కూడా కలవవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు. టీడీపీలో కొందరు నేతలు జూనియర్ ఎన్.టి.ఆర్.ను కోరుకుంటున్నారన్నారు మంత్రి కాకాణి.
Read Also: Vikarabad hidden treasures: గుప్త నిధుల కలకలం.. యజమానిపై గ్రామస్తుల దాడి