Somu Veerraju: ఇది తోలుమందం ప్రభుత్వం.. స్పందన శూన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా వినుకొండ లో బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ చేసి,అధికారంలోకి వస్తామని తెలిపారు సోము వీర్రాజు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కేటగిరీ-జి లో వుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయల నిధులతో రోడ్లు వేస్తుంటే ,రాష్ట్రం 500కోట్ల రూపాయలు కూడా నిధులు ఖర్చు పెట్టడం లేదు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి దారుణంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నడికుడి శ్రీ కాళహస్తి రైల్వే పనులకు ముందుకు వస్తుంటే ,రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు…రాష్ట్రంలో గృహ నిర్మాణాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇళ్ళు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుంటే ,రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మాణం చేయడం లేదు.
Read Also: Jharkhand: భర్త కళ్లెదుటే భార్యపై సామూహిక అత్యాచారం.
Also Read
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. కీలక విషయాల్లో స్పందించడం లేదన్నారు. కేంద్రం యొక్క చురుకుదన్నాని అందిపుచ్చుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. రాష్ట్ర రాజధాని విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు.అవినీతి, కుటుంబ పరిపాలన మూలంగా రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారయ్యింది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాలతొ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక తీరప్రాంతం ఉన్న రాష్ట్రం,మరియు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అత్యధిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నుండి జరుగుతున్న బియ్యం రేషన్ మాఫియా దేశంలో ఎక్కడ జరగడం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా బియ్యం మాఫియా నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు కుటుంబ పాలన సాగిస్తున్నాయన్నారు సోము వీర్రాజు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో లక్షల కోట్ల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుంటే, ఈ కుటుంబ పార్టీలు డబ్బు దండుకోవడానికే పరిపాలన సాగిస్తున్నారు.
ఈ కుటుంబ పార్టీల పాలన అంతమోందించి ,దేశ బావిభారత ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగురువేస్తామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీజేపీ యాత్ర నిర్వహిస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనంతో పొత్తు, లేకుంటే జనసేన పొత్తుతో అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.
Read Also: MLC IqBal on Balayya : బాలకృష్ణపై ఎమ్మెల్సీ ఇక్బాల్ హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!