Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. 2019 జూన్ 22న తొలిసారిగా వైవీ సుబ్బారెడ్డి…
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ జమ చేశారు. ఏటా జూన్, డిసెంబర్ నెలలో పెండింగ్ దరఖాస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కొన్ని మీడియా…