ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు..…
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నరును కూడా ఈ ప్రభుత్వం తమస్వార్థానికి బలి చేసింది. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవు అన్నారు.…
ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుంది. లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో,…
అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది పాదయాత్ర కాదు… రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమం. ఈ మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలి. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్ది పై…