కాకినాడ: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులు స్వీకరించనున్న పవన్. వందపడకల ఆసుపత్రితో పాటు టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థానప చేయనున్న పవన్. గొల్లప్రోటు, చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన. ఐపీఎల్: నేడు చెన్నైతో తలపడనున్న హైదరాబాద్. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ. మే 2న ఏపీ పర్యటనకు ప్రధాని…
బాలుడి కిడ్నాప్.. గంటలో చేధించిన పోలీసులు పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఓ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే, ఈ సంఘటనలో పోలీసులు వేగంగా స్పందించడంతో గంటలోనే బాలుడిని రక్షించి, కిడ్నాపర్లను పట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక బాలుడిని అతని బాబాయి సాదిక్ దగ్గరకు తీసుకెళ్లారు. సాదిక్ బాలుడిని ఓ వైన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన సాదిక్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కనే పడిపోయాడు. ఈ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు.. రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతోఉన్నారు.. హస్తిన వెళ్లనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రేపు సాయంత్రం 4. 30 గంటలకు ప్రధానితో భేటీకాబోతున్నారు.. మే 2వ తేదీన ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న విషయం విదితే.
ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టాలి.. పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టేలా ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి, ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.. ఇది…
పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి…
ఒంగోలులో టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను సీఎం…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి 10 గంటలకు వైజాగ్‌కు వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళులర్పించనున్నారు. ఆపై చంద్రమౌళి కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపిపారు. చంపొద్దని వేడుకున్నా.. ఉగ్రమూకలు వినకుండా చంద్రమౌళిని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం తెలిసిన వెంటనే వైజాగ్ నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు…
దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల…
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుంది.. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం…
వైసీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టిన పార్టీ.. అంతేకాదు పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నామని గుర్తుచేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పీఏసీ సమావేశంలో నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పార్టీలో అత్యున్నతమైనది. ఇందులో తీసుకునే నిర్ణయాలు పార్టీ దశ, దిశను నిర్ణయిస్తాయి. ప్రతి అంశం మీద పార్టీకి దిశా నిర్దేశం చేస్తుంది. వివిధ అంశాల మీద సమగ్రంగా చర్చిస్తూ, పార్టీకి సూచనలు చేస్తుంది. పార్టీ ఏం చేయాలన్న…