విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.
డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.