ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
విద్యా కానుక కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు. విద్యా కానుక కిట్లను ఆలస్యం చేయకుండా విద్యార్ధులకు త్వరితగతిన పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని సీఎం దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి రానున్నారు. ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు చాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నేడు సచివాలయం మొదటి బ్లాక్ చాంబర్లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.