కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఇమిటేట్ చేశారు.
ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన.. గణేష్ నిమర్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ సిటీ పరిధిలో 15 వేలు, ఇతర జిల్లాల నుంచి మరో 3 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. హై కోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు…
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి.. ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించే వారని అన్నారు.
వర్షాలు.. వరదలతో ధ్వంసమైన రోడ్ల మరమ్మతులపై దృష్టి సారాలించాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వరదలకు ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులపై దృష్టి సారించాలన్నారు.. మొత్తం ఎన్ని కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయనే విషయంపై ఆరా తీశారు..
ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సెక్రటేరియట్‌కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి.. పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వాటికి చేయూతను ఇస్తుందని సీఎం అన్నారు.
వరద నష్టంపై తొలిసారి భేటీకానుంది కేబినెట్ సబ్ కమిటీ... ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, అనగాని ప్రసాద్, వంగలపూడి అనిత. ఇప్పటి వరకు జరిగిన వరద నష్టం అంచనాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, ఇళ్ల నష్టం అంచనాలపై చర్చించనుంది కేబినెట్ సబ్ కమిటీ..
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద…