CM Chandrababu: టెంపుల్ సీటి తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ లు పాల్గొననున్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ…
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వార్యంలో యుఫోరియా పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తు్న్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయని అన్నారు. ఒక విషాదంలో ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవ రామ తరకం ఆసుపత్రి. తాను…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలు దూకుడుగా వ్యవహరించారని, కొన్ని సందర్భాల్లో తమ విషయంలో పరిధి దాటి కూడా ప్రవర్తించారన్నది టీడీపీ నేతల అభిప్రాయం. కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. వీరిలో కొడాలి, జోగి, వల్లభనేని వంశీ ఇద్దరూ చంద్రబాబు, లోకేష్‌లపై మాటల దాడి చేస్తే... పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఎక్కువ…
అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.. అప్పులు చేస్తేనే కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు..
AP CS Vijayanand: విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఏపీ సీఎస్ సైతం పాల్గొన్నారు. యుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దగ్గర ఏర్పాటు చేసిన పారిశుధ్య విధానాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు.
CM Chandrababu: నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఫిబ్రవరి 15) పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
CM Chandrababu: స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోగా.. ఈ నెలలో సోర్స్ రీ సోర్స్ అనే అంశాన్ని థీమ్ గా తీసుకోవాలన్నారు. మన మూలాలు - మన బలాలు తెలుసుకునేలా.. రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
అక్రమ కేసులు, కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం వైసీపీకే సాధ్యం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆరోపించారు. పగటిపూట రాంబాబు, రాత్రులు కాంబాబు అయిన అంబటికి డీజీపీ ఎదురొచ్చి స్వాగతం పలకాలా అని అడిగారు. అబ్బయ్య చౌదరి పేరుకి సాఫ్ట్ వేర్, మనిషి హార్డ్‌వేర్ అంటూ మండిపడ్డారు. అలాంటి క్రిమినల్ అయిన అబ్బయ్య చౌదరికి అంబటి వత్తాసు ఏంటి? అని క్వశ్చన్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ను తీసుకొచ్చారు.