చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా కల్లు గీత కార్మికునికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లను రూ. 3 వేలు చేసింది.. మేము వచ్చి రాగానే పింఛన్లను రూ. 4 వేలకు పెంచామని సీఎం అన్నారు.
Also Read:Champions Trophy 2025: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..
గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారు.. మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే.. ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మేము ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నాం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం.. ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నాం.. ఈ ఏడాది రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. ఒక వైపు అప్పులకు వడ్డీ కడుతూనే.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read:Kavya Kalyani: ‘ఢీ’షో డ్యాన్సర్ కావ్య కల్యాణి ఆత్మహత్య
లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నానన్నారు. గత ఐదేళ్లలో లేని సంతోషం ప్రజల్లో కనపడుతోంది. నెలకు 8 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు 10 వేలు ఇస్తున్నాం. నెలకు 2800 కోట్లు, ఏడాదికి 33 వేల కోట్లు ఇస్తున్నాం. జీడీ నెల్లూరులో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఇద్దరు ఆడ పిల్లలను ఆదుకొనేందుకు చర్యలు తీసుకున్నాము. పిల్లల అమ్మమ్మకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించానని అన్నారు. చిన్న పిల్లల పేరుతో 2 లక్ష ల ఫిక్స్డ్ డిపాడిజిట్ చేస్తామని చెప్పారు. అడవి పందులు పొలాల్లో పడి ధ్వంసం చేసినట్లు రాష్ట్రాన్ని గత ఐదేళ్లలో వైకాపా నేతలు లూటీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వాన్ని మీ అర చేతిలోకి తెచ్చాంమని సీఎం అన్నారు.
Also Read:Fire Accident: పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
9371 కోట్లు ఖర్చుపెట్టి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాం. నాలుగు నెలల్లో 20 వేల కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు చేశామని వెల్లడించారు. ఎనిమిది నెలల్లో ఉద్యోగుల రూ. 24 వేల కోట్ల బకాయిలు తీర్చామన్నారు. అమరావతిని మళ్లీ పట్టాలెక్కించాం. పోలవరం నిర్మాణాలను వేగవంతం చేశాం. రైతులకు రాయితీతో సౌర విద్యుత్ ఉత్పత్తి కి అవకాశం కల్పిస్తాం. కుసుం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూర్య ఘర్ పథకంతో ఉచితంగా కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సాంకేతికను ప్రజలు అలవర్చుకోవాలి. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు నేనే పెట్టాను అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మగవాళ్ళు తాగేసి అప్పుడప్పుడూ బాధ్యత మరచినా… మహిళలు కుటుంబ బాధ్యతను తీసుకొంటున్నారని తెలిపారు.