వైఎస్ జగన్కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో…
CM Chandrababu: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో 21 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించారు.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది.
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి.. కేవలం, 9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు అన్నారు. 9 నెలల్లో అమరావతి పేరు చెప్పి చేస్తున్న అప్పు రూ. 52 వేల కోట్లు.. APMDC ద్వారా మరో రూ. 5 వేల కోట్ల అప్పు... 9 నెలల్లోనే ఏకంగా లక్షా 40…
YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారు.. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు అయిందని ఎద్దేవా చేశారు.
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 6) ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి.
మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం…
CPM Srinivasa Rao: ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఆ లేఖలో ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని 27వ తేదీన విశాఖపట్నంలో జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సింది పోయి సవరించాలని చెప్పడం ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది అని తెలిపారు.
Satya Kumar Yadav: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాప్తి పెను సవాల్ గా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 17.5 శాతం కాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9 శాతం మరణాలు క్యాన్సర్ వాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి.