ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సీఆర్డీఏ కమిషనర్, ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. రాజధాని పరిధిలో చేపట్టాల్సిన మరికొన్ని పనులకు అనుమతి ఇవ్వనుంది సీఆర్డీఏ అథారిటీ..
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ..
ఇక అమరావతి అభివృద్ధి అన్‌స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు..
మత్స్యకారుల కుటుంబాలకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని ప్రకటించారు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని…
పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న ఏఐ వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. పాలనలో ఏఐ వినియోగించినా మానవీయకోణం ముఖ్యమని స్పష్టం చేశారు.. టెక్నాలజీ వినియోగంతో రియల్‌టైమ్‌లో సేవల డెలివరీ చేయవచ్చు అని.. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇస్తాం.. త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.. దీంతో ఈరోజు అర్ధరాత్రికి దేశ రాజధాని ఢిల్లీ చేరుకోనున్నారు ఏపీ సీఎం.. అయితే, రేపు ఢిల్లీలో ఏపీ సీఎం కీలక సమావేశాలు ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు…
గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు, అమరావతి పునఃనిర్మాణానికి కూడా రాబోతున్నారు.. మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగనుంది.. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ , హైకోర్టు, రహదారులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు ఏపీ సీఎం..
గత ఏడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌ను రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.. ఇంటి నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు చేరుకుని.. వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు.