క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీపై వర్క్ షాప్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా IBM, TCS, L&T సహకారంతో అమరావతి లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేశారు. Also Read:AP BJP…
ఆదివారం రోజు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జులై 2వ తేదీ నుండి కూటమి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు సీఎం…
CM Chandrababu: నేడు విజయవాడలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ టూరిజం (GFST) ఆధ్వర్యంలో జరుగుతున్న టూరిజం కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగా పరిష్కారమని, యోగా నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. ప్రధాని మోడీ యోగాను దేశంలో ప్రమోట్ చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా డే ఇంత గ్రాండ్ గా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని.. కానీ 3 లక్షలకు పైగా విశాఖపట్నం లో పాల్గొని గిన్నిస్…
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న వారికి షాకింగ్ లాంటి న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అంటూ ప్రకటించారు..
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.
పొగాకు, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 11 రంగాలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో ‘సర్క్యులర్ ఎకానమీ పార్కులు’ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు..
ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. రాష్ట్రం లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై సీఎం కేంద్ర మంత్రి కివినతి పత్రం అందించారు. తాజా రాజకీయ పరిణామాలు.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర సహాయం అంశాలు కూడా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ్టి విశాఖపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు.. షెడ్యూల్ ప్రకారం విశాఖలో నిర్వహిస్తున్న న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్ షాప్లో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు ఏపీ సీఎం..
CM Chandrababu Naidu: నేటితో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రంలో సీఎం చంద్రబాబు నాయుడు “విధ్వంసం నుండి వికాసానికి” అనే నినాదంతో ప్రభుత్వం అందించిన కీలక కార్యక్రమాలపై విశ్లేషణ చేసారు. ఇందులో మొదటగా “తల్లికి వందనం” పథకాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక పథకం కాదని, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతకు భరోసా అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పలు అంశాలపై వ్యాఖ్యానించారు. Read Also:…