విజయవాడ పర్యటకు వెళ్లిన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు.. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు కిషన్ రెడ్డి..
ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు.. అంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు చంద్రబాబు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు..
కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా... 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు.
మొక్కలు నాటేందుకు ప్రజలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజధాని ప్రాంతంలోని అనంతవరం సమీపంలో అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పార్కులో మొక్కలు నాటబోతున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నారు..
మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో.. తుని రైలు ప్రమాదం కేసు అంశంపై మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చిందట.. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే.. ముందే జాగ్రత్త పడాలని సీఎం చంద్రబాబు సూచించారు.. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. అయితే, జరిగిన పొరపాటుకు సీఎంకు క్షమాపణలు చెప్పారు హోంశాఖ కార్యదర్శి..
తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చల సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు.. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేయగా.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు..
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. Also Read:Weather Report : రుతుపవనాల ఆగమనం..…