Free Bus Scheme: మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన
- మహిళకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు..
- ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన..
- ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణంపై ప్రచారం సాగుతూనే ఉంది.. ముహూర్తం పెట్టేశారు.. ఆ డేట్ నుంచే అమలు చేస్తున్నారు.. ఇలా ఎన్నో ప్రచారాలు సాగుతూ వచ్చాయి.. అయితే, మహిళకు శుభవార్త చెబుతూ.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లా పర్యటనలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, తల్లికి వందనం అమలు చేస్తాం.. ఓ కుటుంబంలో ఎంత అంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?
Also Read
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
- Kurnool Ganesh Immersion: వినాయక నిమజ్జనంపై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన.. కర్నూలులో ఎక్కడంటే?
రాయలసీమను రతనాల సీమగా చేస్తాం.. రైతులకు 14 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. దేశంలో ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదేనన్న ఆయన. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీపం-2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం.. పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తి చేయబోతున్నామని తెలిపారు.. ఆగష్టు 15 నుంచి మహిళకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అమలు చేస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు..
Read Also: Vijay Devarakonda : రష్మికతో పెళ్లిపై స్పందించిన విజయ్.. ఏమన్నాడంటే..?
మిద్దెతోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం.. పొదుపు సంఘాల మహిళలను మిద్దెతోటల పెంపకంలో భాగస్వాములను చేస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేసి తడిచెత్తను కంపోస్టుగా తయారు చేయాలి.. ఇంట్లో తయారయ్యే కంపోస్టు మిద్దెతోటలకు వినియోగించవచ్చు అని సూచించారు.. రైతు బజార్లు నేనే పెట్టా .. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు బజార్లు పెట్టాం.. మధ్య దళారులు లేకుండా రైతులు వారి పంటలు అమ్ముకునే అవకాశం కల్పించాం.. 125 రైతు బజార్లు ఉన్నాయన్నారు.. కర్నూలులో 6 కోట్లతో బెస్ట్ రైతు బజారుగా మారుస్తాం., 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లు పెడతాం.. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు దొరకాలి.. రాష్ట్రంలో అన్ని రైతు బజార్లను మెరుగుపరుస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!