ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత క్లౌడ్ కంప్యూటర్ శిక్షణను అందించేందుకు ముందుకు వచ్చింది. టెక్ మహీంద్రా కంపెనీకి చెందిన సీఎస్ఆర్ విభాగం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వబోతున్నది. ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రామ్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్లౌడ్ కంప్యూటరింగ్ 21వ శతాబ్దపు అద్భుత సాంకేతికత ఆవిష్కరణ అని టెక్…