విద్యార్థులు కాలేజీలోనే కొట్టుకున్నారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతోనే పరస్పరం దాడులకు దిగారు.. కలకలం సృష్టించిన ఈ ఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. కాలేజీలోనే సీనియర్లు, జూనియర్లు గొడవకుదిగారు.. బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్.. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసే వస్తువులతో కొట్టుకున్నారు. గత కొంతకాలంగా జూనియర్లు, సీనియర్లు మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇప్పుడు అది దాడి వరకు వెళ్లింది……
బోధన్ ఇష్యూ ఇప్పుడు చర్చగా మారింది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బంద్ వరకు వెళ్లింది పరిస్థితి.. దీంతో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. స్థానికేతరులను ఎవ్వరినీ బోధన్‌లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు.. అయితే, బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు.. శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. Read Also: Muralidhar Rao: తెలంగాణ…
ఆ జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..! పార్టీని బలహీనపర్చడానికే నేతలు కష్టపడుతున్నారా? టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి…
ఒక ప్రేమ జంట చేసిన ఒక పని నలుగురు ప్రాణాలు తీసింది.. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు.. బంధువుల పంక్షన్ లో ఒక బాలికను చూసి ఇష్టపడ్డాడు. కొద్దిరోజులు ఆమె వెనక తిరిగి ప్రేమ గురించి చెప్పాడు.. బాలిక కూడా ఒప్పుకోవడంతో కొన్నిరోజులు చెట్టాపట్టాలేసుకున్న జంట.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంట్లో పారిపోయారు. బాలిక తన…
కర్నూలు ఆలూరు మండలం హులేబీడు, తుమ్మల బీడు గ్రామాల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. మోహరం వేడుకల వివాదంతో ఈ ఘర్షణ జరిగింది. తుమ్మలబీడు పీరులు హులేబీడు రావడం అక్కడి ఆనవాయితీ. కానీ ఈసారి తుమ్మల బీడు స్వామి హులేబీడు కు రాకూడదని స్థానికులు ఆంక్షలు విధించారు. కానీ ఆనవాయితీ ప్రకారం తుమ్మలబీడు పీరులు హులేబీడు లోకి రావడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు గ్రామాల ప్రజలు పరస్పర దాడులకు పాల్పడటంతో పలువురికి…
మంత్రాలకు చింతకాయలు రాలతాయా? ఈ మాటేమోకానీ అక్కడ మాత్రం పిడికెడు ఇసుక.. బారెడు చర్చకు దారితీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య పంచాయితీని పతాకస్థాయికి తీసుకెళ్లిన ఆ ఇసుక చుట్టూనే అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. ఉన్న రాజకీయాలతో ఉద్యోగులు నలిగిపోతున్న సమయంలో.. రామాయణంలో పిడకల వేటలా జరుగుతోన్న ఆ చర్చేంటో ఈస్టోరీలో చూద్దాం. ఉన్నతాధికారుల దగ్గర వాదన వినిపించేందుకు డీసీ, ఏసీ సిద్ధం! విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారుల మధ్య పంచాయితీ అమరావతికి చేరింది. అంతర్గత విభేదాల కారణంగా…
జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఏఐసిసి పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ గ్యాస్ పెరుగుదలకు నిరసనగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై నిరసన తెలిపుతున్న తరుణంలో వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొద్ధిసేపు…
విశాఖ మేఘాద్రి రిజర్వాయర్ దగ్గర మద్యం మత్తులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి .అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ జరుపుకొని, మేఘాద్రి రిజర్వాయర్లో ఈతకు దిగి, గోపాలపట్నం 89 వ వార్డు ప్రాంతానికి చెందిన యువకులతో ఘర్షణ పడి కొట్లాటకు దిగారు. అక్కడ గొడవ సద్దుమణిగి కొత్తపాలెం ప్రాంతానికి చెందిన యువకులు భగత్ సింగ్ నగర్ వద్ద కాపు కాసి దాడి…