Indian Citizenship: గత ఐదేళ్లలో సుమారు 9 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలి పెట్టుకుంటున్నారని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంటులో తెలిపారు. భారత పౌరసత్వం విషయంలో పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఆయన. ఇండియన్ సిటిజన్‌షిప్ వదులుకొనే వ్యక్తుల వార్షిక రికార్డులను కేంద్ర ప్రభుత్వం భద్రపరుస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రికార్డుల ప్రకారం.. 2011-2019 మధ్య 11,89,194 మంది ఇండియన్స్ తమ పౌరసత్వాన్ని వదిలి పెట్టుకున్నారు. Read…