మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు..
మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది వర్మ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకి హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు..
Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు.
AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో…
ఏపీ సీఐడీ నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు వరుస ఫోన్‌లు వెళ్తున్నాయి. ఫేక్ ట్వీట్ విషయంపై మంత్రి అంబటి రాంబాబుపై చేసిన ఫిర్యాదు అంశంలో ఉమ స్టేట్‌మెంట్ రికార్డు చేసుకునేందుకు సీఐడీ ఫోన్‌లు చేస్తోంది. అయితే రెండు రోజులుగా సీఐడీ తనకు వరుసగా ఫోన్‌లు చేస్తుండటంపై దేవినేని ఉమ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడైన మంత్రి అంబటి రాంబాబును కాకుండా.. తన వెంట పడటమేంటని ఫోన్‌లోనే దేవినేని ఉమ సీఐడీ పోలీసులపై…
గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాపారవేత్త శ్రీలంక ప్రజలకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డిని ఇటీవల శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రజలకు ఆయన రూ.5 లక్షలు పంచుతుండగా సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలేసినట్లు రవీందర్‌రెడ్డి…
ఏపీ సీఐడీ దారి తప్పిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఐడీ ఏ దిక్కు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉందని.. ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునే విషయంలో అధికార పార్టీకి సీఐడీ పావుగా ఉపయోగపడుతోందని వర్ల రామయ్య ఆరోపించారు. సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారిందన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కుమారుడిని సీఎం జగన్, సజ్జల బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శలు చేశారు. సునీల్…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్‌బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్‌బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468,…